
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా మే 12న రిలీజ్ అయిన సర్కారువారి పాట సినిమాపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్ర ట్విట్టర్లో స్పందించారు. ఆ సినిమాలో మహేష్ బాబు మెరూన్ కలర్లో ఉన్న జావా మోటార్ సైకిల్‌పై వెళుతున్న ఓ సీన్‌పై రీట్వీట్ చేస్తూ, “అన్‌బీటబుల్ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు-జావా మెరూన్‌లను చూడకుండా ఎలా ఉండగలను? ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నాను. త్వరలో న్యూజెర్సీ వెళ్ళి అక్కడ సర్కారువారి పాట సినిమా చూస్తాను,” అని తెలియజేశారు.
సర్కారువారి పాట సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటి 5 రోజులలోనే రూ.100 కోట్లు కలెక్షన్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. నేటికీ నిలకడగా కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది.
How can I miss watching the unbeatable combination of @urstrulyMahesh and Jawa? I’m in New York & will go out to New Jersey where it’s being screened… #SarkaruVaariPaata, #JawaMaroon https://t.co/ytc5pPQbl1
— anand mahindra (@anandmahindra) May 29, 2022