చిరు సినిమాపై షాకింగ్ న్యూస్..!

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఖైది నెంబర్ 150 సినిమాలో ఓ స్పెషల్ ఐటం సాంగ్ కోసం కేథరిన్ త్రెసాను సెలెక్ట్ చేశారని తెలిసిందే. అయితే ఏమైందో ఏమో కాని ఇప్పుడు ఆ ఐటం సాంగ్ కోసం కేథరిన్ బదులు రాయ్ లక్ష్మిని తీసుకున్నారట. చిరుతో డ్యాన్స్ అంటే ఎలాంటి హీరోయిన్ అయినా సరే అంటుంది మరి అలాంటిది రాయ్ లక్ష్మి ఆ ఛాన్స్ దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

అల్లు అర్జున్ తో మూడు సినిమాల్లో నటించిన కేథరిన్ చిరుతో స్టెప్పులేసేందుకు సిద్ధమయ్యింది తీరా సెట్స్ మీదకు వెళ్ళేసరికి అమ్మడు హ్యాండ్ ఇచ్చిందట. అందుకే సడెన్ గా రాయ్ లక్ష్మిని రంగంలో దింపారట చిత్రయూనిట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ హైలెట్ గా నిలుస్తాయట. మెగాస్టార్ మార్క్ అదిరిపోయే స్టెప్పులు కూడా ఇందులో ఉంటాయని ఊరిస్తున్నారు. 

సంక్రాంతి రేసులో దించేందుకు చిత్రయూనిట్ కృషి చేస్తున్నారు. వినాయక్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా రూపొందించబడుతుంది.