
కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి చేసిన తమిళ యాక్షన్ సినిమాల తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు మంచి ఆదరణే లభించింది. కనుక తొలిసారిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగులోనే ఓ సినిమా చేస్తున్నాడు. దానికి సంబందించి చిత్ర బృందం నిన్న కొత్త సమాచారం తెలిపింది.
గత నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకొన్న ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయినట్లు ప్రకటించింది. 25 రోజుల పాటు సాగిన తొలి షెడ్యూల్లో విజయ్‌పై ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించామని తెలిపారు. దీనిలో రష్మిక మందన హీరోయిన్ కాగా, శ్రీకాంత్, ప్రభు, శరత్ కుమార్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు ముఖ్య పాత్రలలో చేస్తున్నారు.
ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించవలసి ఉంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శిరీష్ కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ ధమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
And it's a schedule wrap for #Thalapathy66
The team had an awesome time shooting for important sequences in this schedule. Excited to kickoff our next schedule super soon.#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/aaIP8ssAW2