నాని డేరింగ్ డెశిషన్..!

నాచురల్ స్టార్ నాని ఏ రేంజ్ ఫాంలో ఉన్నాడో ఇప్పుడు తన సినిమాలు వసూళ్లను చూస్తే తెలుస్తుంది. రీసెంట్ గా మజ్నుతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం నేను లోకల్ గా రాబోతున్నాడు. త్రినాధ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తర్వాత నాని ఓ ఫ్లాప్ డైరక్టర్ కు ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలో నాని ఈ డేరింగ్ డెశిషన్ తీసుకోవడం అందరిని షాక్ కు గురి చేస్తుంది. ఇంతకీ నాని ఛాన్స్ ఇచ్చే ఆ డైరక్టర్ ఎవరు అంటే ఓ మై ఫ్రెండ్ డైరక్టర్ వేణు శ్రీరామ్. 

సిద్ధార్థ్, శృతి హాసన్, హాన్సిక వంటి భారీ స్టార్ కాస్ట్ తో తీసిన ఓ మై ఫ్రెండ్ నిరాశ పరచింది. ఇక ఆ సినిమా ఫ్లాప్ తో ఐదేళ్లు ఖాళీగా ఉన్న వేణు శ్రీరామ్ ఇప్పుడు మరోసారి మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. నానికి సరిపోయే ఓ అద్భుత కథను సిద్ధం చేశాడట వేణు. నాని కూడా కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దిల్ రాజు నిర్మాణంలోనే ఈ సినిమా ఉంటుందని టాక్. ప్రస్తుతం నేను లోకల్ కూడా దిల్ రాజు నిర్మాణంలోనే వస్తుంది. 

కెరియర్ మంచి జోష్ లో ఉన్న నాని వేణు శ్రీరామ్ తో సినిమా కమిట్ అవడం కాస్త డౌట్ పడేలా ఉన్నా నాని నమ్మకం ఎప్పుడు గెలుస్తుందని జెంటిల్ మన్ తో ఫ్లాప్ లో ఉన్న ఇంద్రగంటి మోహనకృష్ణకు అవకాశం ఇచ్చినప్పుడే ప్రూవ్ అయ్యింది. మరి వేణుతో నాని సినిమా ఎలా ఉండబోతుందో ఆ సినిమాలో నటించే మిగతా నటీనటులెవరో తెలుసుకోవాలంటే మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.