ఒకేసారి బాలయ్య రెండు సినిమా టైటిల్స్‌ ఖరారు?

అఖండ విజయంతో నందమూరి బాలకృష్ణ, ఆయన అభిమానులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అఖండ తరువాత గోపీచంద్ మలినేని ధర్శకత్వంలో బాలకృష్ణ తన 107వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్‌తో ఉంటుంది కనుక ఇది కూడా బాలయ్య మార్క్ యాక్షన్, డైలాగ్స్‌తో చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. 

ఈ సినిమాకు మొదట ‘అన్నగారు’ అనే టైటిల్ అనుకొన్నప్పటికీ, దానిని తన 108వ సినిమాకు ఉపయోగించుకోవాలని బాలకృష్ణ నిర్ణయించడంతో, ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్‌ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. అదే సమయానికి మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ కూడా విడుదలవుతుంది. కనుక వచ్చే సంక్రాంతి ఈ రెండు సినిమాల మద్య పోటీ ఉండబోతోంది.  

గోపీచంద్ మలినేనితో సినిమా తరువాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేయబోతున్నారు. దానికి ‘అన్నగారు’ టైటిల్ ఖరారు అయినట్లే భావించవచ్చు. ఈ సినిమాలో బాలకృష్ణ వయసులో ఉన్న ఓ కూతురికి తండ్రిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు శ్రీలీల, బాలాయ్యకు జోడీగా ప్రియమణి నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడనుంది.