వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. శేఖర్ రాజు అనే వ్యక్తి ఆయనపై కూకట్‌పల్లి కోర్టులో ఓ కేసు వేశారు. రాంగోపాల్ వర్మ దిశ సినిమా కోసం తన వద్ద నుంచి రూ.56 లక్షలు అప్పు తీసుకొన్నారని, కానీ అప్పటి నుంచి ఎన్నిసార్లు అడుగుతున్నా సొమ్ము తిరిగి ఇవ్వకపోగా తనను బెదిరిస్తున్నాడని శేఖర్ రాజు పిటిషన్‌లో పేర్కొన్నాడు. కనుక రాంగోపాల్ వర్మ నుంచి తనకు ఆ సొమ్ము ఇప్పించి ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై సెక్షన్స్ 406,407,506 కింద కేసు నమోదు చేశారు. దీనిపై రాంగోపాల్ వర్మ ఇంకా స్పందించవలసి ఉంది.