సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ మూవీలుగా నిలిచాయి. కనుక మళ్ళీ సుమారు 11 ఏళ్ళ తరువాత వారిద్దరూ కలిసి చేయబోతున్న ఈ మూవీపై సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి.
అయితే టైటిల్ విషయంలో మహేష్ బాబు-త్రివిక్రమ్ మద్య చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘అర్జునుడు’ అని త్రివిక్రమ్ టైటిల్ అనుకొంటుండగా, మహేష్ బాబు ఇప్పటికే అర్జున్ పేరుతో ఓ సినిమా చేశాడు కనుక వేరే టైటిల్ పెట్టాలని కోరినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా యాక్షన్ మూవీగా ఉంటుంది కనుక మహేష్ బాబు కోరినట్లుగా దానికి తగ్గట్లుగా మరో టైటిల్ సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే మహేష్ బాబుకి హీరోయిన్‌గా ఆడిపాడి అలరించబోతోంది. ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని కూడా కీలక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది.
హారిక అండ్ హాసినీ క్రియెషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించబోతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కధ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. కనుక మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం మరో స్థాయిలో ఉండవచ్చని మహేష్ బాబు అభిమానులు భావిస్తున్నారు.