
భారతీయ సినీ పరిశ్రమలో మరో సరికొత్త ప్రయోగానికి మేజర్ సినిమా సిద్దం అవుతోంది. సాధారణంగా సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్ల కొరకు ప్రత్యేకంగా ప్రీవ్యూ షోలు వేస్తారని అందరికీ తెలుసు. అయితే సాధారణ ప్రేక్షకుల కోసం ప్రీవ్యూ షో వేయాలని మేజర్ చిత్ర బృందం సంచలన నిర్ణయం తీసుకొంది.
ఈ సినిమా జూన్ ౩వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుండగా, దానికి 10 రోజుల ముందే దేశంలో ఎంపిక చేసిన 9 నగరాలలో ఒక్కో రోజు చొప్పున ప్రీవ్యూలు వేయాలని నిర్ణయించారు.
ముందుగా రేపు అంటే మే 24న పూణేలో, 25న జైపూర్, అహ్మదాబాద్ నగరాలలో, 27న దిల్లీలో, 28న లక్నోలో, 30న బెంగళూరులో, 31న కొచ్చిలో, జూన్ 1న ముంబైలో, చివరిగా జూన్ 2న హైదరాబాద్‌లో మేజరూ సినిమా ప్రీ-వ్యూలు వేయబోతున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రివ్యూ చూసేందుకు బుక్ మై షో యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవలసి ఉంటుందని ఈ సినిమాలో మేజర్ ఉన్ని కృష్ణన్‌గా నటించిన అడవి శేష్ తెలిపారు.
ఈ ప్రయోగం విజయవంతమైతే ఇకపై భారతీయ సినిమాలకు ఇదొక కొత్త మార్గం చూపినట్లవుతుంది.