
తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న యువ నటులలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్ జంటగా చేసిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా మే6న రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొంది. సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసే అల్లం అర్జున ప్రసాద్ పాత్రలో వయసు మీరిన పెళ్ళి కొడుకుగా విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడు. సినిమా కధ, కాన్సెప్ట్, కామెడీ, హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్‌తో కెమిస్ట్రీ అన్నీ చక్కగా పండాయి. కానీ ఈ సినిమా విడుదలైన వారం రోజులకే సర్కారువారి పాట రిలీజ్ అవడంతో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దీంతో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 27వ తేదీన ఆహా ఓటీటీలో ఈ సినిమా విడుదల కాబోతోంది. కనుక ఓటీటీ ప్రేక్షకులకు ఇది వేసవి కానుకే అవుతుంది.