పెళ్ళి పీటలు ఎక్కనున్న నయనతార-విఘ్నేష్

తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన అభినయం, అందంతో మెప్పించిన నయనతారకు వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అనేక ఎదురుదెబ్బలు తిన్నారు. అయినా సినీ కెరీర్‌లో మాత్రం నేటికీ ఆమెకు తిరుగులేదని నిరూపించుకొంటూనే ఉన్నారు.

ఆమె గత కొన్నేళ్ళుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో సహజీవనం చేస్తున్నారు. ఈరోజు వారిద్దరూ కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు త్వరలో తాము వివాహం చేసుకోబోతున్నట్లు స్వయంగా మీడియాకు చెప్పారు. తాము తిరుమల శ్రీవారి సన్నిధిలోనే పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నామని అందుకే ఇవాళ్ళ తిరుమలలో కళ్యాణ మండపం బుకింగ్ చేసుకొనేందుకు  వచ్చామని నయనతార, విఘ్నేష్ చెప్పారు. వచ్చే నెల 9వ తేదీన వారి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది.     

నయనతార ఇటీవల విఘ్నేష్ దర్శకత్వంలో తమిళంలో కాథు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాని తెలుగులో కణ్మని రాంబో ఖతీజా పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. దీని తరువాత ఆమె మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారు. అట్లీ దర్శకత్వంలో ఓ మలయాళ సినిమాలో నయనతార నటిస్తున్నారు.