రాజీవ్‌తో పంచాయతీ కొనసాగుతోంది: సుమ

తెలుగు ప్రేక్షకుల సుపరిచితమైన పేరు సుమ... యాంకర్ సుమ. ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నప్పుడు ఆలీ ఆమెతో “మీ ఆయన రాజీవ్ కనకాలకి మీకు మద్య ఏమిటి పంచాయతీ?ఇద్దరూ విడిపోయారట కదా?” అని ప్రశ్నించగా, సుమ కూడా తనదైన శైలిలో చాలా చక్కగా సమాధానం చెప్పారు. 

“అవును పెళ్ళనేదే ఓ పంచాయతీ. మాకు పెళ్ళయి 23 ఏళ్ళు. అప్పటి నుంచి రోజూ మా మద్య పంచాయతీ నడుస్తూనే ఉంది. భార్యభర్తల మద్య చిన్న చిన్న గొడవలు కీచులాటలు సహజమే. ఇప్పటికీ మేము గొడవ పడుతూనే ఉంటాము. అలాగని విడిపోయేంత పెద్ద గొడవలు కావవి. కానీ మేము విడిపోయి విడాకులు కూడా తీసేసుకొన్నట్లు కొన్ని వెబ్‌సైట్‌లు రాసి పడేశాయి. అవి చూసి మేము చాలా బాధపడ్డాము. కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి ఇటువంటి బాధలు తప్పవని భరిస్తున్నాము. పిల్లలు పుట్టకమునుపు భార్య భర్తలు విడిపోవడం సులువేమో కానీ పిల్లలు పుట్టాక అటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. పిలలకు అన్యాయం చేసినవారం అవుతాము కూడా. 

మా పిల్లలు కూడా ఇప్పుడు కాస్త పెద్ద వాళ్ళు అయ్యారు కనుక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. దీంతో నేను నా బయట పనులకు మరికాస్త ఎక్కువ టైమ్ కేటాయించగలుగుతున్నాను. అయినా నేను చాలా ప్లాన్ ప్రకారం నా కెరీర్, సంసారం చక్కగా బ్యాలెన్స్ చేసుకొంటూ హాయిగా గడిపేస్తున్నాను. అందరం సంతోషంగానే ఉన్నాము. మాకేమి కంప్లైంట్స్ లేవు,” అని చెప్పారు.