జూన్‌ 24న సమ్మతమే

తెలుగు సినీ పరిశ్రమలోకి ఇప్పుడు నిత్యం అనేకమంది కొత్తహీరో హీరోయిన్లు, దర్శకులు, రచయితలు ప్రవేశిస్తున్నారు. అటువంటి వారే కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి. వీరిద్దరు జంటగా నటిస్తున్న ‘సమ్మతమే’ అనే పేరుతో ఇటీవలే ఓ సినిమా పూర్తి చేశారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, లిరికల్ వీడియో అందరినీ విశేషంగా ఆకర్షించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ్ దీనిని నిర్మించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టమని, సినిమాను జూన్‌ 24న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత ప్రవీణ్ చెప్పారు. ఈ సందర్భంగా ఓ రిలీజ్ పోస్టరును విడుదల చేశారు. ఇది పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టెయినర్ అని, కనుక దీనిని యువత, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తారని భావిస్తున్నామని చెప్పారు.