ఆచార్యకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

ఈ నెల 29న విడుదల కాబోతున్న ఆచార్య సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 5వరకు ఆచార్య అదనంగా 5వ షో వేసుకొనేందుకు, టికెట్ ధరలు పెంచుకొనేందుకు అనుమతిస్తూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రవి గుప్త సోమవారం సాయంత్రం జిల్లాల కలెక్టర్లకు, పోలీస్ కమీషనర్లకు, సంబందిత అధికారులకి ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా రూ.30, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.50  చొప్పున పెంచుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఏపీ ప్రభుత్వం ఆచార్యకు ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వవలసి ఉంది. 

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఆచర్యకు కెమెరా తిర్రు, సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.