వాటికి రెడీ అంటున్న రష్మి..!

స్మాల్ స్క్రీన్ పై రెచ్చిపోతున్న హాట్ గాళ్ రష్మి గుంటూర్ టాకీస్ సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా వాడుకుంటున్న రష్మి ఈసారి తాను ఐటం సాంగ్స్ కూడా రెడీ అంటుంది. చిరు సినిమా ఐటం ఆఫర్ వస్తే చేస్తారా అన్న ప్రశ్నకు ఆన్సర్ గా చిరు సినిమానే కాదు ఏ స్టార్ హీరో సినిమాలో ఐటం ఆఫర్ వచ్చినా సరే తప్పకుండా చేస్తా అంటుంది.

ప్రస్తుతం తను సినిమాల్లో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించగా ఇప్పుడు ఐటం సాంగ్స్ తో కూడా ఆడియెన్స్ ను అలరించాలని చూస్తుంది. ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా తన అందాల మత్తులో తెలుగు ప్రేక్షకులను ముంచేస్తున్న రష్మి ఇక ఐటం గాళ్ గా కూడా మారితే ఇక ఏమన్నా ఉందా. హీరోయిన్ గానే ఓ రేంజ్ లో రెచ్చిపోయే రష్మి ఇక ఐటంగా ఎంతకు తెగిస్తుందో చూడాలి.

హీరోయిన్ గా ఫుల్ ఊపులో వరుసెంట ఓ ఐదారు సినిమాల్లో రెచ్చిపోయిన రష్మి ఇప్పుడు కొత్తగా ఐటం గాళ్ గా టర్న్ తీసుకుని అదరగొట్టబోతుంది. మరి అమ్మడిని ఐటం గాళ్ గా చూపించే హీరో ఎవరో చూడాలి.