సంబంధిత వార్తలు
ఒక్కో సినిమాని మూడు నాలుగేళ్ళపాటు చెక్కితే గానీ తృప్తిపడని దర్శకుడు రాజమౌళి తాను రోజూ ప్రయాణించే కారు విషయంలో రాజీ పడతారా? అంటే కాదనే చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ అవడంతో చాలా హుషారుగా ఉన్న రాజమౌళి వోల్వో కంపెనీ తయారు చేసిన ఎక్స్‌సీ-40 మోడల్ ఎరుపు రంగు కారును కొనుకొన్నారు. దీని ధర రూ. 44.50 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). ఇది చాలా అత్యాధునికమైన ఫీచర్స్, సౌకర్యాలు, పూర్తి భద్రత కలిగి అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైనది. వోల్వో కంపెనీ ప్రతినిధి శనివారం ఈ కారును రాజమౌళికి హైదరాబాద్‌లో అప్పగించారు.