సర్కారువారి పాట...మూడోసారి

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట సినిమాలో తొలి పాటను ఈరోజు కొద్ది సేపటి క్రితం చిత్ర బృందం విడుదల చేసింది. సరా సరా సర్కారువారి పాట.. షురూ షురూ అన్నాడురా... అల్లూరివారి బేటా... అంటూ ఉర్రూతలూగిస్తూ సాగిన ఈ టైటిల్ సాంగ్‌కు తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో నేటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కళావతి, పెన్నీ పెన్నీ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 

పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మహేష్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. సర్కారువారి పాట మే 12న విడుదల కాబోతోంది.