
ప్రముఖ నటి సమంత ఇవాళ్ళ చాలా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “నా నిశబ్దాన్ని అమాయకత్వంగా, నా శాంతాన్ని అంగీకారంగా, నా దయను బలహీనతగా భావించి పొరబడవద్దు. ఎందుకంటే, దయకు కూడా ఎక్స్‌పైరీ తాజా అప్‌డేట్స్ ఉంటుంది,” అని ట్వీట్ చేశారు.
దీంతో ఆమె ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశ్యించి చేసినదనే చర్చ మొదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా మొదలుకాబోతున్న ఓ సినిమాకు గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సమంత, దీనిలో నటించబోతున్న వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణలు రాకపోవడంతో విజయ్ దేవరకొండ వారు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు ఫోటోషాప్ చేసి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
దానిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది దానిని సరదాగా తీసుకోగా, కొందరు వారు ముగ్గురూ రాకపోవడం సరికాదన్నట్లు ట్రోల్ చేస్తున్నారు. సమంతను కూడా వారు విడిచిపెట్టలేదు కనుక బహుశః వారిని ఉద్దేశ్యించి ఆమె ఈవిదంగా ట్వీట్ చేశారా?లేక సమంత, నాగచైతన్యలను మళ్ళీ కలపడానికి అఖిల్ సమంతను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అక్కినేని కుటుంబం నాగ చైతన్యకు మరో హీరోయిన్‌తో మళ్ళీ పెళ్లి చేయబోతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక కొందరు ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. కనుక సమంత వారిని ఉద్దేశ్యించి ఈ ట్వీట్ చేశారా?లేక సినీ ఇండస్ట్రీలో మరెవరినైనా ఉద్దేశ్యించి చేసినవా?అనేది తెలియదు. కనుక అభిమానులు ఎవరికి తోచినట్లు వారు నిర్వచించుకొంటున్నారు.