అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ నవ్వులు పండించిన ఎఫ్2 సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3 కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కూడా తమన్నా, మెహ్రీన్‌లు వారికి హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఊ..ఆహా..ఆహా.. అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రా బృందం ఈరోజు విడుదల చేసింది. దానిలో వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్లతో పాటు సునీల్-సోనాల్ చౌహాన్ కూడా డ్యాన్స్ అదరగొట్టేశారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఎఫ్3కి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతోంది.