రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆశించిన దానికంటే చాలా భారీగా కలక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఆర్ఆర్ఆర్ వెయ్యి కోట్లు రాబట్టి ఇంకా దూసుకుపోతూనే ఉంది. ఈ సినిమా గురించి అందరూ వినేశారు కనుక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది?దేనిలో రిలీజ్ అవుతుంది?అనే దానిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులు ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. కనుక ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్స్ జూన్ 3న జీ5లో విడుదల చేయబోతున్నట్లు, అలాగే హిందీ, ఇంగ్లీష్ ఇతర విదేశీ బాషల వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ రెండో వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే ఆర్ఆర్ఆర్ కోసం మరో నెలరోజులు పైనే ఎదురుచూడాలన్న మాట! ఈ వార్తను ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం లేదా జీ5, నెట్‌ఫ్లిక్స్ ఇంకా దృవీకరించాల్సి ఉంది.