నేడే ఆచార్య ట్రైలర్ రిలీజ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రలలో వస్తున్న ఆచార్య ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఇవాళ్ళ (మంగళవారం) సాయంత్రం 5.49 గంటలకు ఆచార్య థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ ట్రైలర్ రన్ టైమ్ 2.35 నిమిషాలు ఉంటుందని తాజా సమాచారం. 

అసలు కొరటాల సినిమా అంటేనే సూపర్ హిట్ అనే టాక్ ఉంది. ఆ సినిమాలో తెలుగు ప్రేక్షకులు అభిమాన హీరోలు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ ఇద్దరూ చేస్తే మరెంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఈ సినిమా కోసం మెగా ఫాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ సినిమాలో మరో విశేషమేమిటంటే మగధీర సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా నటించిన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటించింది. రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఇంకా ఈ సినిమాలో సోనూ సూద్, తనికెళ్ళ భరణి, జీషు సేన్ గుప్తా, సౌరవ్ లోకేశ్, కిశోర్, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో రామ్ చరణ్‌, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ సినిమాకు కెమెరా తిర్రు, సంగీతం మణిశర్మ అందించారు.