
విభిన్నమైన కధాంశాలతో సినిమాలు తీస్తూ ధైర్యంగా ప్రయోగాలు చేసేవారిలో నాగార్జున అగ్రస్థానంలో నిలుస్తారు. మన్మధుడు, ఊపిరి, రాజన్న, డాన్, రాజుగారి గది, సోగ్గాడే చిన్ని నాయిన వంటి సినిమాలు ఇందుకు కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంతో ‘ది ఘోస్ట్’ అనే సినిమా చేస్తున్నారు. దీనిలో జంటగా నటిస్తున్న నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. ఇటీవలే దుబాయ్లో ఓ పెద్ద షెడ్యూల్ పూర్తి చేసి ఇప్పుడు ఊటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు.
ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లలో నారాయణ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు శరత్ మరార్ నిర్మిస్తున్నారు.