మహేష్ సర్కారువారి పాట పాడేదెప్పుడో?

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారువారి పాట’ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మే 12న సినిమాను రిలీజ్ చేస్తామని దర్శకనిర్మాతలు డేట్ ప్రకటించినప్పటికీ, ఇంకా రెండు సాంగ్స్ షూట్ చేయవలసి ఉన్నందున ఆరోజున సినిమా రిలీజ్ కాకపోవచ్చునని తాజా సమాచారం. అవి పూర్తయిన తరువాత పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ వంటి పనులకు కనీసం ఓ నెల సమయం పడుతుంది. కనుక ఈ సినిమా జూలై లేదా ఆగస్ట్ నెలల్లో రిలీజ్ కావచ్చునని తెలుస్తోంది. సినిమా రిలీజ్‌పై మీడియాలో వస్తున్న ఈ ఊహాగానాలపై చిత్ర బృందం స్పందించకపోవడంతో సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని అందరూ భావిస్తున్నారు. 

పరశురామ్ దర్శకత్వంలో పూర్తి యాక్షన్, రొమాంటిక్ చిత్రంగా సర్కారువారి పాటను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జి మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్,సుబ్బరాజు, రాజీవ్ కుమార్‌, అమిత్ శివదాస్ నాయర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.