ఏప్రిల్ 8న ఆహాలో స్టాండప్ రాహుల్ విడుదల

రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘స్టాండప్ రాహుల్’ చిత్రం మార్చి 18న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతోంది. ఈనెల 8న ఆహా ఓటీటీలో ఈ సినిమా విడుదల కాబోతోంది. శాంటో మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ హాస్య చిత్రంలో వెన్నెల కిషోర్, మురళీశర్మ, ఇంద్రజ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. భరత్ మగులూరి, నందకుమార్ అబ్బినేని ఈ సినిమాకు నిర్మాతలు.