
చరిత్ర కథగా చెప్పే సినిమాల్లో నందమూరి స్టైలే వేరు.. అసలు పౌరాణిక సినిమాలు చేయాలంటే నందమూరి వారే చేయాలి అన్న విధంగా సత్తా చాటుతున్నారు. ఇక నందమూరి నట సింహం అయితే అలాంటి సినిమాలకు పెట్టింది పేరు. ఇక ప్రస్తుతం తీస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు బాలయ్య బాబు. క్రిష్ డైరక్షన్లో శాతవాహణన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ తోనే వారెవా అనిపించాడు.
ఇక కొద్దిగంటల క్రితం రిలీజ్ అయిన టీజర్ అయితే బాలయ్య తడాఖా ఏంటో చూపిస్తుంది. తన మార్క్ ఎమోషన్ పండిస్తూనే రాజుగా గర్జిస్తున్నాడు బాలకృష్ణ. సంక్రాంతి బరిలో దిగేందుకు తొడగొడుతున్న బాలయ్య టీజర్ తో సినిమా మీద అంచనాలను పెంచేశాడు. ఓ విధంగా చెప్పాలంటే సినిమా మరో బాహుబలి అన్న ఫీల్ కలిగించాడు క్రిష్. మరి సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. దసరా కానుకగా రిలీజ్ చేసిన ఈ టీజర్ నందమూరి ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్ అని చెప్పొచ్చు.