బాహుబలి-2 హక్కులు ఏషియన్ మూవీస్ సొంతం

స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా రైట్స్ ఏరియాల వారిగా ఎంత రేటుకి అమ్ముడయ్యింది అన్న విషయం మీద కూడా మంచి క్రేజ్ వస్తుంది. ప్రస్తుతం అందరు ఎదురుచూస్తున్న బాహుబలి పార్ట్-2 నైజాం డిస్ట్రిబ్యూషన్ కోసం ఎంతోమంది పోటీపడ్డారు. కాని ఫైనల్ గా ఏషియన్ మూవీస్ వారు బాహుబలి పార్ట్-2 నైజం హక్కులను సొంతం చేసుకున్నారు. బాహుబలి ది బిగినింగ్ తో భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా పార్ట్-2 అంతకు మించి వసూళు చేస్తుంది అన్న నమ్మకంతో తీవ్రమైన పోటీలో ఏషియన్ మూవీస్ వారు ఏకంగా 45 కోట్ల పెద్ద మొత్తంతో ఈ రైట్స్ సొంతం చేసుకోవడం జరిగింది. 

హైదరాబాద్ తో సహా మిగతా ఏరియాల్లో కూడా ఏషియన్ సొంత థియేటర్స్ ఉన్నాయి కాబట్టి వసూళ్ల పరంగా భారీగానే వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రపంచం మొత్తం తెలుగు సినిమా స్థాయిని పరిచయం చేసిన రాజమౌళి ఈ పార్ట్-2 ను కూడా ఎంతోప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నాడు. మరి 45 కోట్ల భారీ మొత్తంతో కొనేసిన ఏషియన్ వారు సినిమాతో ఏ రేంజ్ లాభాలను పొందుతారో చూడాలి.