మహేష్ బాబుతో డిసెంబర్‌లోగా సినిమా ప్రారంభిస్తా

ఆర్ఆర్ఆర్‌ సినిమా ఆశించిన దానికంటే సూపర్ హిట్ అయ్యింది. సుమారు మూడున్నరేళ్ళపాటు దీని కోసం పనిచేసిన రాజమౌళి తరువాత ఎవరితో సినిమా తీయబోతున్నారో అని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని రాజమౌళి ఇదివరకే సూచనప్రాయంగా చెప్పారు. ఇప్పుడు దానిని దృవీకరించారు. 

ఇటీవల ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్‌తో చిట్ చాట్ చేసినప్పుడు మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగినప్పుడు, సినిమా పూర్తి స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తవడానికి మరో ఏడు నెలలు పట్టవచ్చు కనుక ఈ ఏడాది డిసెంబర్‌లోగా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది,” అని రాజమౌళి చెప్పారు. 

మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయడం ఖరారు అయ్యింది కనుక ఆ సినిమా కధ ఏవిదంగా ఉండబోతోంది? దానిలో రాజమౌళి మహేష్ బాబును ఏవిదంగా చూపబోతున్నారు? ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు? సినిమాను ఎంతకాలంలో పూర్తిచేస్తారు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీటికి త్వరలోనే జవాబులు దొరకుతాయని ఆశిద్దాం.