నెట్‌ఫ్లిక్స్‌లో సూర్య సినిమా ఈటీ రిలీజ్ ఎప్పుడంటే..

సూర్య, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన ‘ఈటీ: ఎవరికీ తలవంచడు’ చిత్రం మార్చి 10న థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి టాక్, కలెక్షన్లు సంపాదించుకొంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌, సన్ నెక్స్ట్ ఓటీటీలలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాశాలలో ఒకేసారి విడుదలకాబోతోంది. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జైభీమ్ సినిమాలు ఇదివరకు ఓటీటీలో సూపర్ హిట్ అయినందున ఇప్పుడు ఈటీ సినిమాను కూడా ఓటీటీ ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారని భావిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు.