రూ.500 కోట్లు కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్

రాజమౌళి, జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలైంది. విడుదలైన తొలిరోజే రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్లు కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక హిందీ వెర్షన్‌ కూడా శుక్రవారం రూ.19 కోట్లు, శనివారం రూ.24 కోట్లు, ఆదివారం రూ.31.50 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా విడుదలైన వారం రోజులలోనే రూ.500 కోట్లు వసూలు చేయడంతో మున్ముందు మరో రూ.1,000 కోట్లు రాబట్టినా ఆశ్చర్యం లేదు. కనుక భారత్‌ సినీ చరిత్రలో ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డు సృష్టించబోతోందని స్పష్టమవుతోంది. ఇప్పటికే రూ.500 కోట్లు రావడంతో ఈ సినిమాకు పెట్టిన మొత్తం పెట్టుబడి (రూ.400-450 కోట్లు) పూర్తిగా వసూలు అయిపోయింది కనుక ఇకపై వచ్చే ఆదాయం అంతా నిర్మాత డీవీవీ దానయ్యపై కురిసే కనకవర్షమే అవుతుంది. ప్రస్తుతం కలెక్షన్ల వరద పోటెత్తుతున్నందున, మరో రెండు మూడు నెలల తరువాతే ఈ సినిమాను ఓటీటీలో విడుదలచేయవచ్చని సమాచారం.