ఆర్ఆర్ఆర్ టీంకు జూ.ఎన్టీఆర్‌ పేరుపేరునా కృతజ్ఞతలు

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం సూపర్ హిట్‌ అవడంతో జూ.ఎన్టీఆర్‌ ఆ సినిమాలో ప్రతీ ఒక్కరినీ గుర్తు చేసుకొంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ లేఖ ద్వారా పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 

కుమరం భీమ్ పాత్ర ద్వారా తనలో నటుడిని బయటకు తీసి చూపించినందుకు జక్కన్న (రాజమౌళి)కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఎప్పటికీ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. 

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ తప్ప మరొకరు నటించలేరు. చరణ్ నువ్వు లేని ఆర్ఆర్ఆర్ సినిమాను ఊహించుకోలేను. నువ్వు లేనిదే ఈ సినిమా లేదు...నేను లేను,” అంతో చాలా భావోద్వేగంతో పేర్కొన్నారు.

ఈ సినిమాకి కధ అందించిన విజయేంద్ర ప్రసాద్ పేరు భవిష్యత్‌ తరాలవారు కూడా తలుచుకొంటారని జూ.ఎన్టీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన అజయ్ దేవగణ్, ఆలియా భట్ తదితరులను జూ.ఎన్టీఆర్‌ ప్రశంశిస్తూ ఈ సినిమా విజయంలో భాగస్వాములైనందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 

ఇక హాలీవుడ్ నటులు ఒలివియా, అలిసన్ డూడి, రే స్టీవెన్‌సన్‌లకు భారతీయ సినిమాలోకి స్వాగతం పలికారు జూ.ఎన్టీఆర్‌. ఇంత గొప్ప సినిమా నిర్మించిన నిర్మాత డీవీవీ దానయ్యగారికి, ఈ సినిమాకు అత్యాధుభాతమైన సంగీతం అందించిన కీరవాణికి, కెమెరా మెన్ సింథిల్ తదితరులందరికీ జూ.ఎన్టీఆర్‌ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 

జూ.ఎన్టీఆర్‌ ఈవిదంగా ఈ సినిమాలో తనతో కలిసి పనిచేసిన అందరికీ పేరుపేరునా ప్రశంశిస్తూ కృతజ్ఞతలు తెలుపుకోవడం ఆయన సంస్కారానికి నిదర్శనంగా నిలుస్తోంది. జూ.ఎన్టీఆర్‌ ఏమన్నారో ఆయన మాటలలోనే...