ఈవారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న కొత్త సినిమాలు

దేశంలో అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ హాట్ స్టార్, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్  వచ్చినప్పుడు వాటి వలన సినీ పరిశ్రమకు తీరని నష్టం కలుగుతుందని చాలా మంది భయపడ్డారు. ఓటీటీలలో సినిమాలు వచ్చేస్తుంటే ఇంక ప్రజలు థియేటర్లకు ఎందుకు వస్తారనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ సినీపరిశ్రమకు ఇప్పుడు అవే ఓటీటీలు వరంగా కూడా మారాయి. 

సినీ పరిశ్రమ-ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ మద్య చక్కటి అవగాహన ఏర్పడటంతో, ఇప్పుడు పెద్ద, చిన్న సినిమాలు, కొత్త, పాత సినిమాలు, వివిద భాషల సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు, థియేటర్లలో ఆడలేని సినిమాలకు, ఫ్లాప్ సినిమాలకు ఓటీటీ ఓ వరంగా మారింది. ఓటీటీల ద్వారా కూడా నిర్మాతలకు అదనపు ఆదాయం వస్తుండటంతో ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా థియేటర్లో బొమ్మ పడిన నెలరోజులలోగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘రాధేశ్యామ్’ ఈ వారంలో ఓటీటీలో విడుదల కాబోతుండటమే ఇందుకు తాజా ఉదాహరణ. ఈవారంలో ఒటీటీలో విడుదల కాబోతున్న కొత్త సినిమాలు ఇవే: 

అమెజాన్ ప్రైమ్‌:  

మార్చి 31: శర్మాజీ నమ్‌కీన్ (హిందీ చిత్రం)

ఏప్రిల్ 1: రాధేశ్యామ్ (తెలుగు చిత్రం)

ఆహా: 

ఏప్రిల్ 1: ‘హలో జూన్’ (తెలుగు డబ్బింగ్) 

డిస్నీ+హాట్ స్టార్‌: 

మార్చి 30: భీష్మ పర్వం (మలయాళ చిత్రం)

మార్చి 30: మూన్ లైట్ (డబ్బింగ్ చిత్రం)

ఏప్రిల్ 1: క్రికెటర్ ప్రవీణ్ తాంబే జీవిత కధ ఆధారంగా రూపొందిన చిత్రం ప్రవీణ్ తాంబే ఎవరు? (తెలుగు డబ్బింగ్) 

సోనీ లైవ్‌: 

ఏప్రిల్ 2: శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు