సంబంధిత వార్తలు

రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన రాధేశ్యామ్ బాక్సాఫీసు వద్ద బోల్తాపడటం ప్రభాస్ అభిమానులకు, సినీ ప్రియులకు చాలా బాధ కలిగించే విషయమే. ఈ సినిమాలో తొలిసారిగా ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించి మెప్పించారు కానీ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కనుక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో రాధేశ్యామ్ విడుదలకాబోతోంది. కనుక థియేటర్లలో చూడలేకపోయినవారు ఇప్పుడు ఇంట్లోనే రాధే శ్యామ్‌ను సకుటుంబ సమేతంగా చూసి ఆనందించవచ్చు.