గుంటూరు కలెక్టర్‌గా నితిన్

యువహీరో నితిన్ కెరీర్ ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్నట్లు సాగుతోంది. మాస్ట్రో తరువాత ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో వస్తున్నాడు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎన్‌.సిద్దార్ధ్ రెడ్డిగా నటిస్తున్నాడు. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టరును చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో కేథరిన్ ధెరిసా, కృతిశెట్టి ఇద్దరు హీరోయిన్లున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మాటలు: మామిడాల తిరుపతి, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: మహతి స్వరసాగర్, ఆర్ట్: సాహి సురేష్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు.