అమృత్‌సర్‌ స్వర్ణమందిరంలో ఆర్ఆర్ఆర్

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రలలో రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక వారు ముగ్గురూ ఆర్ఆర్ఆర్ చిత్రబృందంతో కలిసి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సోమవారం వారు ముగ్గురూ అమృత్‌సర్‌కి వెళ్ళి  అక్కడి స్వర్ణమందిరాన్ని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురూ అక్కడి ఆనవాయితీ ప్రకారం తెల్లటి దుస్తులు ధరించి, తలకు తెల్లగుడ్డ కట్టుకొని పూజాకార్యక్రమాలలో పాల్గొన్నారు. అక్కడ వారు తీసుకొన్న ఫోటోను ఆర్‌ఆర్ఆర్   మూవీ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.  

బాహుబలి సూపర్ హిట్ అయిన మూడేళ్ళ తరువాత రాజమౌళి తీసిన సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్‌ చాలా భారీ అంచనాలున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన కుమురుం భీమ్, అల్లూరి రామరాజు పాత్రల కల్పిత పాత్రలతో తీసిన హిందీ ప్రేక్షకులను మెప్పించగలిగితే ఇక రాజమౌళికి, జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లకు తిరుగు ఉండదు. కరోనా అవాంతరాలు అధిగమించి మరో నాలుగు రోజులలో మార్చి 25న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంతవరకు రాజమౌళి తీసిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లే కనుక ఇదీ సూపర్ హిట్ అవుతుందనే భావించవచ్చు.