సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట సినిమా ఈ సినిమాలోని ‘ఎవ్రీ పెన్నీ..’ అంటూ సాగే రెండో పాటను ఈనెల 20న రిలీజ్ చేయబోతున్నారు. అయితే అనూహ్యంగా ఈ పాటకు నేడు ప్రోమోను విడుదల చేశారు. దీనిలో మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గ్రూప్ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. ఆమె చాలా అలవోకగా డ్యాన్స్ చేయడం చూస్తే తెలుగు సినీ పరిశ్రమకు మరో హీరోయిన్ దొరికినట్లే అనిపిస్తుంది. ఈ పాటను తమన్ కంపోజ్ చేశారు.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారువారి పాట సినిమాను మహేష్ బాబు తన సొంత బ్యానర్ జీమహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్, రామ్ అచంట, గోపి అచంట కలిసి నిర్మిస్తున్నారు.
వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. మే 12న విడుదలవుతుంది.