ఎఫ్-3 నుంచి తాజా అప్‌డేట్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పీర్జాదాలు ప్రధాన పాత్రలలో రూపొందిన ఎఫ్-2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమాను తలుచుకొంటే నేటికీ అందరి మొహాలపై చిర్నవ్వులు పూయకమానవు. అంతగా కడుపుబ్బ నవ్వించిన ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా త్వరలో ఎఫ్-3 రాబోతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈసారి ఎఫ్-3 టీంలో కొత్తగా కామెడీ కింగ్ సునీల్, అందాల భామ సోనాల్ చౌహాన్‌లు కూడా చేరారు. ఎఫ్-2 కంటే ఎఫ్-3 మరింత వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెపుతున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రఘుబాబు, వైవిజయ, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఎఫ్-3లో చేస్తున్న నటీనటులు, టెక్నీషియన్స్ నవ్వులు చిందిస్తున్న ఓ వీడియోను నిన్న హోళీ సందర్భంగా చిత్రా బృందం విడుదల చేసింది. 

నిర్మాత దిల్‌రాజు తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న ఎఫ్-3కి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మళ్ళీ కరోనా మహమ్మారి విరుచుకుపడకుండా ఉంటే మే 27న ఈ సినిమా విడుదలవుతుంది.