
ఇప్పటిదాకా మంచి నటుడిగా కమెడియన్ గా పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం చేయబోయే సినిమా బాలీవుడ్ హంటర్ రీమేక్ అని తెలియడంతో అందరు అతనికి వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. వన్స్ అలాంటి సినిమా నువ్వు తీస్తే మళ్లీ సిన్సియర్ క్యారక్టర్స్ చేయడం కష్టమే అయినా సరే ఓ బాలీవుడ్ బోల్డ్ మూవీలో హీరో పాత్ర చేస్తున్నా అవసరాల శ్రీనివాస్.
ఇక ఆ సినిమాకు తెలుగు టైటిల్ గా సోగ్గాడు అని పెడుతున్నారట. ట్యాగ్ లైన్ గా బాబు బాగా బిజీ అని పెట్టేస్తున్నారట. హాలీవుడ్ సినిమాలకు వి.ఎస్.ఎక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన నవీన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం విశేషం. హంటర్ రీమేక్ లో హీరోయిన్స్ ఇంకా ఫైనలైజ్ అవలేదు కాని ఈ సినిమా చేస్తున్నందుకు అవసరాల ఓ పెద్ద సాహసమే చేస్తున్నాడని అంటున్నారు. మరి సాహసం చేస్తున్నసోగ్గాడు ఈ సినిమాతో ఆడియెన్స్ ను ఏ రేంజ్లో అలరిస్తాడో చూడాలి.
ఇక ఓ పక్క నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే దర్శకుడిగా తన ప్రతిభ చాటుకుంటున్నాడు అవసరాల శ్రీనివాస్. హంటర్ సినిమా మొదటి భాగం కాస్త బోల్డ్ గా ఉన్నా సెకండ్ హాఫ్ తనకు కన్నీళ్లు తెప్పించిందని అందుకే ఈ సినిమా చేస్తున్నానని అంటున్నారు అవసరాల శ్రీనివాస్.