
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా వస్తున్న సర్కారువారి పాట సినిమా ఈ ఏడాది మే 12న విడుదలకాబోతోంది. ఈ సినిమాలోని ‘కళావతి’ అనే తొలి పాట ఇప్పటికే రిలీజ్ య్యింది. సోషల్ మీడియాలో ఆ పాటకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు సర్కారువారి పాట సినిమాలోని ‘పెన్నీ..’ అంటూ సాగే రెండో పాటను ఈనెల 20న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ పాటను సంగీత దర్శకుడు తమన్ కంపోజ్ చేశారు.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మహేష్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సర్కారువారి పాట అని పేరు ఖరారు చేసినప్పుడే ఇది మంచి యాక్షన్ చిత్రమని స్పష్టం అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల రొమాంటిక్, కామెడీ సీన్స్ చూస్తే సర్కారువారి పాట అన్ని కమర్షియల్ హంగులతో అందరినీ ఆకట్టుకొనేలా రూపొందుతున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా మే 12న విడుదలకాబోతోంది.