సంబంధిత వార్తలు
.jpg)
వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ జంటగా నటించిన ‘గని’ సినిమా ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆ చిత్రా బృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆ సినిమా ట్రైలర్ నేడు విడుదల చేశారు. ఈ సినిమా బాక్సింగ్ కధతో తీసినందున ఊహించినట్లుగానే ట్రైలర్ మంచి కిక్కిచ్చే యాక్షన్ సీన్స్‌తో తీసి అందించారు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సిద్దు, అల్లు బాబీలు నిర్మించారు. ఈ సినిమాకు కెమెరాజార్జ్ చ్ ధామస్, సంగీతం ఎస్ ధమన్ అందించారు. జగపతిబాబు, ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు దీనిలో ముఖ్యపాత్రలు చేశారు.