సంజయ్ బన్సాలి దర్శకత్వంలో బన్నీ హిందీ మూవీ?

పుష్పతో అల్లు అర్జున్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. కనుక పుష్ప-2 పూర్తిచేసిన తరువాత వీలైతే ముందుగానే పాన్ ఇండియా స్థాయి సినిమా ఒకటి చేయాలని అల్లు అర్జున్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశః అందుకే అల్లు అర్జున్‌ ముంబై వెళ్ళి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలిని ఆయన కార్యాలయంలో కలిసి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంజయ్‌లీలా బన్సాలి తీసిన గంగూబాయ్ కతియావాడి హిందీ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కనుక ఆయన కూడా తన తదుపరి సినిమా పనులు మెల్లగా ప్రారంభించారు. ఒకవేళ దక్షిణాదిన టాప్ హీరోలలో ఒకడైన అల్లు అర్జున్‌, ఉత్తరాది టాప్ దర్శకులలో ఒకరైన సంజయ్‌లీలా బన్సాలి కలిసి సినిమా చేస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోలేము. త్వరలోనే వీరిరువురి కాంబినేషన్‌లో సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.