
దసరా బరిలో అభినేత్రిగా వచ్చిన తమన్నా తెలుగు హింది భాషల్లో సోసో సినిమానే అనే టాక్ తెచ్చుకుంది కాని తమిళంలో మాత్రం హిట్ అనేస్తున్నారు సిని పండితులు. తెలుగులో దసరా సీజన్లో నాలుగు ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి అందులో క్లియర్ కట్ గా ప్రేమం సూపర్ హిట్ దక్కించుకుంది ఇక సెకండ్ ప్లేస్ కోసం అన్ని కొట్టుకుంటున్నాయి. ప్రేమం తర్వత ఏది అంతగా ప్రభావితం చేయలేదు. ఇకపోతే కోలీవుడ్ లో మాత్రం విజయ్ సేతుపతి రెక్క.. శివ కార్తికేయన్ రెమో సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యాయి. వాటికి పోటీగా తమన్నా దేవి వచ్చింది.
ప్రభుదేవ చాలా రోజుల తర్వాత చేసిన సినిమా కాబట్టి కోలీవుడ్లో దేవి మంచి టాక్ అందుకుంది. ఓ విధంగా రెక్క, రెమోల కన్నా తమన్న దేవినే హిట్ అనేస్తున్నారు తమిళ తంబీలు. ఈ లెక్కన తెలుగు హింది భాషల్లో నిరాశ పరచిన అభినేత్రి కోలీవుడ్ లో మాత్రం హిట్ కొట్టిందన్నమాట. ప్రభుదేవ డ్యాన్స్ తో పాటు కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేస్తున్న తమిళ ప్రేక్షకులు తమన్నా అందానికి ఫిదా అయినట్టు కనిపిస్తుంది.
ఎక్కడ బోర్ కొట్టకుండా నడిపించే కథ కథనాలే అక్కడ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాయి. ఇక అది కాకుండా దర్శకుడు విజయ్ తమిళ దర్శకుడే కావడం చేత ఆయనకున్న స్పెషల్ ఇమేజ్ కూడా అక్కడ సినిమా హిట్ కు కారణం అయ్యింది. తెలుగులో యావరేజ్ అనిపించుకుంటున్న అభినేత్రి తమన్నా తమిళంలో మాత్రం హిట్ దక్కించుకుంది అన్నమాట.