
నందమూరి కళ్యాణ్ రాం ఇజం మూవీ ఈ నెల 20న రిలీజ్ అని ముందు నుండి చెప్పారు. అయితే సాధారణంగా సినిమాలన్ని శుక్రవారం సెంటిమెంట్ తో వస్తాయి కదా మరి కళ్యాణ్ రాం గురువారం వస్తున్నాడేంటి అని అనుకున్నారంతా కాని మళ్లీ ఆ డేట్ మార్చి ఓ రోజు ఆలస్యంగా రానుందట ఇజం అంటే 20 కాస్త 21కి రిలీజ్ అంటున్నారు. ఇక ఈ రిలీజ్ కు సంబందించి ఎటువంటి క్లారిటీ రాలేదు.
పూరి మార్క్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ ఇజంలో కళ్యాణ్ రాం కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పట్ల కళ్యాణ్ రాం పూర్తి నమ్మకంతో ఉన్నాడట. టెంపర్ హిట్ తర్వాత జ్యోతిలక్ష్మి, లోఫర్ సినిమాలతో ఫ్లాప్ ఫేస్ చేసిన పూరి ఆ కసితో ఈ ఇజం తీశాడు. ఈ మధ్యనే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, నందమూరి హరికృష్ణ చేతుల మీద ఈ సినిమా ఆడియో రిలీజ్ అయ్యింది.
అదితి ఆర్య నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా కోసం తన బడ్జెట్ లిమిట్ దాటి పెట్టేసిన కళ్యాణ్ రాం ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.