ఈవారం ఓటీటి రిలీజ్ అయ్యే సినిమాలు

సినీ పరిశ్రమలో సంక్రాంతి సీజన్, వేసవి సీజన్, దసరా దీపావళి పండుగల సీజన్ ఉంటాయి కనుక పెద్ద చిన్నా సినిమాలన్నీ ఆ సీజన్లలో ఎక్కువగా విడుదలవుతుంటాయి. అయితే ఓటీటిలలో ప్రతీ వారం ఓ సీజనే. ఒకటో రెండో కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ‘జల్సా’, దుల్కర్ సల్మాన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ‘సెల్యూట్’, యువహీరో కిరణ్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించిన ‘సెబాస్టియన్ పిసి 524’ మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. 

జల్సా: సురేష్ త్రివేణి దర్శకత్వంలో విద్యాబాలన్ పాత్రికేయురాలి పాత్రలో నటించిన జల్సా సినిమా ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుంది. ఈ సినిమాలో రోహిణీ హట్టంగడి, సూర్య కాశీభట్ల తదితరాలు నటించారు.

సెల్యూట్: రోషన్ అండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ ఒక పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. కరోనా కారణంగా థియేటర్లలో విడుదల చేయలేకపోవడంతో ఇప్పుడు నేరుగా సోనీ లైవ్‌ ఓటీటిలో ఈ నెల 18న విడుదలవుతోంది. 

సెబాస్టియన్ పిసి 524: ఈ సినిమాలో రేచీకటి వ్యాధితో బాధపడే పోలీస్ కానిస్టేబుల్‌గా కిరణ్, అతనికి జోడీగా నువేక్ష నటించారు. ఈ సినిమాకు బాలాజీ సయ్యపు రెడ్డి దర్శకత్వం వహించగా సిద్దారెడ్డి నిర్మించారు. మార్చి 4న థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి ట్రాఫిక్‌ తెచ్చుకొంది. ఈనెల 18న ఆహా ఓటీటిలో విడుదల కాబోతోంది.