నిర్మాత బెల్లంకొండపై చీటింగ్ కేసు నమోదు

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌లపై హైదరాబాద్‌ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లో ఉంటున్న విఎస్ ప్రవీణ్ అనే ఫైనాన్సర్ బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్‌ తనకు రూ. 85 లక్షలు బాకీ ఉన్నారని కానీ దానిని వారు తిరిగి చెల్లించడకుండా మోసం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ చేపట్టి ప్రవీణ్ సమర్పించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ పత్రాలన్నిటినీ పరిశీలించిన తరువాత, బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్‌ ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేయవలసిందిగా సిటీ సెంట్రల్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశం మేరకు క్రైమ్ పోలీసులు వారిరువురిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.