
సినీ పరిశ్రమలో నిలద్రొక్కుకోవడానికి హీరోయిన్లే చాలా అవస్థలు పడుతుండగా ఓ టీవీ యాంకర్ సినిమాలో రాణిస్తుండటం, అదీ...తనదైన ముద్ర వేయడం విశేషమే. ఆ వ్యక్తి ఎవరో కాదు అనసూయ. ఆమె మంచి నటి అని అందరికీ తెలుసు. అయితే మంచి నటి కనుక ఆమె పాపులర్ అయ్యారనుకోలేము. సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద కామెంట్స్ చేస్తుండటం ఒక కారణమైతే ఆమె కాస్త బోల్డ్‌గా డ్రెస్సులు ధరిస్తుండటం, అప్పుడప్పుడు ఐటెమ్ సాంగ్స్ కూడా చేస్తుండటం మరో కారణంగా కనిపిస్తోంది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫోటోలను చూస్తే అర్ధమవుతుంది.
నిజానికి విదేశాలలో మహిళలు ఇటువంటి డ్రెస్సులు ధరించడం సర్వసాధారణం. భారత్‌లో కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యి చాలా ఏళ్ళే అయ్యింది. కానీ అనసూయ అటువంటి డ్రెస్సులు ధరిస్తేనే ఎందుకు కామెంట్స్ వస్తాయి?అంటే బహుశః ఆమె ఇద్దరు పిల్లల తల్లి గనుక హుందాగా కనిపించాలని అందరూ ఆశిస్తుంటే ఆమె అందుకు భిన్నంగా బోల్డ్‌గా కనిపిస్తుండటమే కావచ్చు. అంటే మన సమాజం ఇంకా ఈ మార్పును అంగీకరించలేకపోతోందనుకోవాలేమో?