అభిమానులను నమ్మలేం..!

నాచురల్ స్టార్ నాని ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడు. అయితే ప్రస్తుతం హిట్లు కొడుతున్న నాని కేవలం అభిమానులను నమ్మి మాత్రం సినిమాలు తీయలేం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పటి నుండి ఫ్యాన్స్ ను చూస్తున్నానని.. ఓ స్టార్ హీరో కోసం వారు రెండు గంటలే వెయిట్ చేసి అతనికి రెండు రోజుల నుండి వెయిట్ చేస్తున్నామని చెప్పారని అప్పటి నుండే ఫ్యాన్స్ గురించి అంతగా పట్టించుకోవట్లేదు అన్నాడు. 

ఇక వారి పొగడ్తలను కూడా పట్టించుకోను అంటున్నాడు. ఇక తన కెరియర్ లో జెండాపై కపిరాజు సినిమాకు బాగా కష్టపడ్డానని రెండు సంవత్సరాలు కష్టపడ్డ సినిమా ఫ్లాప్ అవగా కేవలం ఆరు నెలల్లో కంప్లీట్ చేసిన భలే భలే మగాడివోయ్ రికార్డులు క్రియేట్ చేసిందని అన్నాడు. కష్టపడ్డాం కాబట్టి ఫ్యాన్స్ సినిమా చూస్తారంటే నమ్మను వారికి సినిమా నచ్చితేనే సినిమా చూస్తారు అంతే. 

అయినా సరే నచ్చిన సినిమా మళ్లీ మళ్లీ చూసేది కూడా ఫ్యాన్సే అని నానికి తెలియదు కాబోలు. ఏది ఏమైనా నాని ఫ్యాన్స్ కేవలం సినిమా అవుట్ పుట్ మీదే డిపెండ్ అయ్యి వారు హిట్ చేస్తారే తప్ప సినిమా ఎలా ఉన్నా వారు ఆడించేయరు అంటున్నాడు నాని.