నిజజీవితంలో ప్రేమ, పెళ్ళి గురించి ప్రభాస్ ఏమన్నారంటే...

ప్రభాస్ మళ్ళీ చాలా రోజుల తరువాత రాధే శ్యామ్ వంటి మంచి రొమాంటిక్ చిత్రంతో మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేతో ప్రభాస్ రొమాన్స్ చాలా గొప్పగా ఉంటుందని టీజర్, ట్రైలర్ ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. అయితే ప్రభాస్ నిజ జీవితంలో ఎవరినైనా ప్రేమించాడా?ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు?అని ఆయన అభిమానుల ప్రశ్నకు సమాధానం దొరకలేదు. నిన్న రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల సందర్భంగా ఓ విలేఖరి ఇదే విషయం గురించి సినిమాతో ముడిపెట్టి ప్రశ్నించాడు. 

ఈ సినిమాలో ‘ప్రేమ విషయంలో విక్రమాదిత్య అంచనాలు తప్పాయి,’ అనే డైలాగ్ ఉంది మరి నిజజీవితంలో కూడా ప్రేమలో విఫలమయ్యారా?’ అని అడిగినప్పుడు, ప్రభాస్ చాలా చెప్పిన జవాబుకి అందరూ ముసిముసి నవ్వులు నవ్వారు. ఇంతకీ ప్రభాస్ ఏమి చెప్పాడంటే, “జీవితంలో ఒక్కసారి కాదు..చాలాసార్లు ప్రేమ విషయంలో నా అంచనాలు తప్పాయి. అందుకే నాకు ఇంకా పెళ్ళి కాలేదు,” అని అన్నాడు.