రాధే శ్యామ్ ట్రైలరే ఇంత గొప్పగా ఉంటే...

ప్రభాస్, పూజా హెగ్డేలు జంటగా నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11నా ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. బుదవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దానిలో ఎవరూ ఊహించని స్థాయిలో యాక్షన్, థ్రిల్లింగ్, రొమాంటిక్  సీన్స్ చాలా ఆకట్టుకొనేలా ఉన్నాయి. వాటిని చూస్తే సినిమా ఇంకెంత గొప్పగా ఉంటుందో అని అనుకోకుండా ఉండలేము. 

ఈ సినిమాకు దక్షిణాది భాషల వెర్షన్స్‌కు జస్టిన్ ప్రభాకరన్, హిందీలో అనూమాలిక్, మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. బాహుబలితో ఉత్తరాది, దక్షిణాది ప్రజలను సమానంగా అలరించిన ప్రభాస్, దాని తరువాత చేస్తున్న ఈ  సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియెషన్స్ రెండూ కలిసి దీనిని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నాయి.