కొరటాలకు భారీ ఆఫర్..!

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ మూడు సినిమాలతో సూపర్ హిట్ అందుకుని క్రేజీ డైరక్టర్ గా మారిన కొరటాల శివ తన తర్వాత సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన కథను సిద్ధం చేసే పనిలో ఉన్న కొరటాల శివ ఆ సినిమాకు గాను రెమ్యునరేషన్ గా ఓవర్సీస్ రైట్స్ తీసుకుంటున్నాడని టాక్.

మహేష్ సినిమా అది ఓవర్సీస్ ప్రైజ్ అంటే ఇక ఊహించుకోవచ్చు. శ్రీమంతుడు అక్కడ 2.9 మిలియన్ డాలర్ కలెక్ట్ చేసింది అంటే మన దగ్గర 19 కోట్లన్నమాట. సో అలా లెక్కేసుకుంటే కనీసం 15 నుండి 17 కోట్ల వరకు అయినా కొరటాల శివ దక్కించుకునే అవకాశం ఉంది. ఈ డీల్ కు ఏమాత్రం సంకోచించకుండా ఓకే చెప్పిన కొరటాల శివ సినిమాకు కూడా మరో బ్లాక్ బస్టర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు.

రచయిత దర్శకుడిగా మారితే ఎంత కథ బాలమున్న సినిమా ఆడియెన్స్ కు అందించొచ్చో కొరటాల శివ నిరూపించాడు. మరి కొరటాల తన హిట్ మేనియాను మహేష్ సినిమాతో కూడా కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.