
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా భోళా శంకర్. నేడు మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాలో చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దానిలో చిరంజీవి చూపు వేలుతో త్రిశూలం బొమ్మ ఉన్న కీ చైన్ తిప్పుతూ జీపు ముందు స్టైల్‌గా కూర్చొని పక్కా మాస్ లుక్‌తో కనిపిస్తున్నారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ భోళా శంకర్. ఇది చిరంజీవి సినీ కెరీర్‌లో 154వ చిత్రం. దీనిలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగ సీజన్‌లో భోళా శంకర్ అభిమాన ప్రేక్షకుల మద్యకు వచ్చే అవకాశం ఉంది.
Happy #MahaSivaratri to All !🙏
Here goes the #VibeOfBHOLAA #BholaaShankarFirstLook #BholaaShankar 🔱@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @dudlyraj #MahathiSwaraSagar @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/XVxVYP5316