ఓటీటీలో వచ్చేస్తున్న సామాన్యుడు, డిజె టిల్లు

ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా ఏదో ఓ రోజు ఓటీటీలోకి రావలసిందే. జైభీమ్, పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాలే ఇందుకు తాజా నిదర్శనం. ఇక చిన్న సినిమాలు, ఎవరేజ్‌ టాక్‌ తెచ్చుకొన్న సినిమాలను ఆదుకొనేవి ఓటీటీలే అని వేరే చెప్పక్కరలేదు. 

ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకొన్న ‘డిజె టిల్లు’ మార్చి 4న ఆహా ఓటీటీలో విడుదల కాబోతోంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించారు. 

విశాల్, డింపుల్ హయతీ జంటగా నటించిన ‘సామాన్యుడు’ చిత్రం జనవరి 26న థియేటర్లలో విడుదలై మంది టాక్ తెచ్చుకోండి. ఇది కూడా మార్చి 4వ తేదీన జీ5 ఓటీటీలో విడుదలకాబోతోంది. ఈ సినిమాకు శరవణన్ దర్శకత్వం వహించారు. 

ఇవికాక మార్చి 2 నుంచి 4లోగా అనేక హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, జీ5 ఓటీటీలలో విడుదలకానున్నాయి.